Sunday, September 8, 2024

హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ ఎస్ ఎల్పీ

- Advertisement -

న్యూఢిల్లీ, నవంబర్ 21, (వాయిస్ టుడే): స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు  హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో అనారోగ్యంతో మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం  తీర్పు ఇచ్చింది. ఈ నెల 28 వరకూ మధ్యంతర బెయిల్ షరతులు వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో ఆయన పాల్గొనవచ్చని పేర్కొంది. దీనిపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని, వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. అయితే, తీర్పు సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ‘నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో ఆయన పాత్ర ఉందని చెప్పలేం. చంద్రబాబు, టీడీపీ ఖాతాకు నిధులు మళ్లింపుపై కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఉల్లంఘనలపైనా అధికారులు సీఎంకు చెప్పినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేశారు. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు. ఆయన జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదు. సీమెన్స్‌ డైరెక్టర్‌, డిజైన్‌టెక్‌ యజమాని వాట్సప్‌ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటి? చంద్రబాబు లాయర్ల వాదనలతో అంగీకరిస్తున్నాం’ అని హైకోర్టు స్పష్టం చేసింది.ఈ కేసులో నిధులు దారి మళ్లాయన్న సీఐడీ వాదనలపై ఏపీ హైకోర్టు స్పందిస్తూ, దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలకు మళ్లాయన్న దానిపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు సమర్పించలేదని చెప్పింది. అలాగే, బోస్, డిజైన్ టెక్ యజమాని మధ్య వాట్సాప్ సందేశాలకు, ఈ కేసులో పేర్కొన్న లావాదేవీలకు సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. ‘2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకొని, ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.241 కోట్ల నిధులను సీమెన్స్, డిజైన్‌టెక్‌ షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ వాదిస్తోంది. నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడుతుందా.? అని పిటిషనర్‌ ప్రశ్నిస్తున్నారు.’ అని కోర్టు వ్యాఖ్యానించింది. శిక్షణ కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్ సైతం చెప్పడం లేదని గుర్తు చేసింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ సెప్టెంబర్ 9న ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.

సెప్టెంబర్ 22 వరకూ రిమాండులో ఉన్న చంద్రబాబును, 2 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. అనంతరం సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్ విధించిన కోర్టు అక్టోబర్ 5 వరకూ దాన్ని కొనసాగించింది.అనంతరం విచారణ అనంతరం అక్టోబర్ 19 వరకూ చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది.అనంతరం అనారోగ్య కారణాల దృష్యా అక్టోబర్ 31న చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుమారు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, నవంబర్ 24న సాయంత్రం చంద్రబాబు సరెండర్ కావాలని ఆదేశించింది. ఆయనకు అందించిన వైద్యం వివరాలను నివేదికలో సమర్పించాలని ఆదేశించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్