Thursday, April 24, 2025

 ప్రజలకు  క్షమాపణ చెప్పాలి

- Advertisement -

 ప్రజలకు  క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్, ఏప్రిల్ 14

Apologize to the people.

ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలుకూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన మోసాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎస్సీ డిక్లరేషన్ అమలులో పూర్తిగా విఫలమైంది, దళిత డిక్లరేషన్ ఇచ్చిన హామీల సంగతి ఏమైంది. ఎస్సీ డిక్లరేషన్ అంశంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పాపాలకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి  లాంటి మోసగాడు చెప్తే నమ్మరని, మల్లికార్జున ఖర్గేను తెలంగాణకు రప్పించి మరీ ఎస్సీ రిజర్వేషన్ ప్రకటన చేయించారు. మల్లికార్జున ఖర్గే మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి లాంటి మోసగాడి పాలన ఈరోజు చూసుంటే రాజ్యాంగ నిర్మాతలు రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టేవారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు తెలంగాణ భవన్‌లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అసమర్ధ పాలనతో ఎండిన పొలాలు, అన్ని వర్గాల కళ్లళ్లోనూ నీళ్లు.. కాంగ్రెస్ అంటే కరువు.. కరువు అంటే కాంగ్రెస్! అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నాడు బీఆర్ఎస్ హయాంలో పంటలు పచ్చగా కళకళలాడేవి. నేడు కాంగ్రెస్ పాలనతో పొలాలు ఎండిపోతున్నాయి. కక్షతో కాళేశ్వరం పంపులను పడావుపెట్టి, నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కనపెట్టారు. గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చినా నీటిని ఒడిసిపట్టుకోకుండా వదిలేసిన ఫలితం ఎండిన పంట పొలాలు అన్నారు. తాగునీళ్లు లేక గొంతులు తడారుతున్నాయి.పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయె. తలాపునా పారుతుంది గోదారి. మన సేను, మన సెలుక ఎడారి. నాడు కేసీఆర్ గారి పాలనలో జలకళ కనిపిస్తే.. నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో విలవిల. నాడు ఇంటింటికి నల్లానీళ్లు రాగా, నేడు ఆడబిడ్డల కండ్లల్లో కన్నీళ్లు. ఇది శ్రీశైలం, సాగర్ జలాశయాలను ఏపీ సర్కారు ఖాళీ చేస్తున్నా నోరెత్తని కాంగ్రెస్ సర్కారు తప్పిదం. కాళేశ్వరం నుండి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ గారి మీద కక్షతో రిజర్వాయర్లను, చెరువులు, కుంటలు నింపని కాంగ్రెస్ పాపం. ఇది కాలం పెట్టిన శాపం కాదు. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పెట్టిన శఠగోపం. జాగో తెలంగాణ జాగో!’ అని ఎక్స్ ఖాతాలో కేటీఆర్ పోస్ట్ చేశారు.
అంబేద్కర్ ఘనంగా నివాళి
రాజ్యాంగ నిర్మాత, డాక్డర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన జయంతి సందర్భంగా.. ఆ మహానీయుడి సేవలను సర్మిరించుకున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతానన్నారు సీఎం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగు, బలహీనవర్గాలకు 42 శాతల రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ఇక SC వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నారు. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు 12 వేల ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు రేవంత్‌రెడ్డి.ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.ఈ సందర్భంగా.. అంబేద్కర్‌ జయంతిరోజున ఈ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్‌-1లో, మధ్యస్థ లబ్ధిపొందిన కులాలను గ్రూప్‌-2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్‌-3లో చేర్చింది. 2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన.. ఎస్సీ జనాభాలో 61.96 శాతం ఉన్న మాదిగ కులంతో సహా 18 కులాలను గ్రూప్‌-2 కింద చేర్చి.. 9 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది. 29.26 శాతం ఉన్న మాల, మాలఅయ్యవార్‌ కులంతో సహా 26 కులాలను గ్రూప్‌-3లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు.. 3.28 శాతం మంది ఉన్న 15 కులాలను.. గ్రూప్‌-1లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది.కొద్దిరోజుల క్రితమే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ నాలుగు సిఫార్సులు చేసింది. వాటిలో… రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్‌ పాయింట్ల విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు.. క్రీమీలేయర్‌ సిఫార్సును తిరస్కరించింది. మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను.. శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టింది. రెండుచోట్లా నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూరింది.కాగా.. తెలంగాణవ్యాప్తంగా సోమవారం నుంచి భూ భారతి పోర్టల్ అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అంబేద్కర్ 134వ జ‌యంతి సంద‌ర్భంగా భూభార‌తి చ‌ట్టాన్ని, పోర్టల్‌ను ప్రజ‌ల‌కు అంకితం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని వివరించారు. ఆ పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్