Thursday, March 12, 2026

 ఆర్గానిక్ వస్తువుల కోసం యాప్

- Advertisement -

 ఆర్గానిక్ వస్తువుల కోసం యాప్
హైదరాబాద్, ఫిబ్రవరి 17, (వాయిస్ టుడే)

App for organic goods
s: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను సిద్ధం చేస్తోంది. నకిలీల నుంచి విముక్తి కల్పించేలా యాప్ తీసుకొస్తున్నారు. ఈ

యాప్‌లో సమగ్ర సమాచారం ఉండేలా ప్లాన్ చేశారు. అటు రైతులు, ఇటు ప్రజలకు ఉపయోగంగా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది అంటున్నారు.తెలంగాణలో

రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొంతకాలంగా ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు.. కొంతకాలంగా విక్రాలు కూడా పెరిగాయి. ఇదే క్రమంలో ఆర్గానిక్ పేరుతో నకిలీవి కూడా మార్కెట్‌లోకి

వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. అసలు ఏదో, నకిలీవి ఏవో తెలియడం లేదు.. రైతులు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఓ

యాప్‌ను తీసుకొస్తోంది. త్వరలోనే ఆర్గానిక్ యాప్‌ను సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు వారి ఉత్పత్తులతో ఆదాయం పెంచుకునేందుకు ఈయాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సాగును

ప్రోత్సహించేందుకు రాయితీలూ ఇవ్వనుంది.తెలంగాణలో 50వేల ఎకరాల్లో 10వేలమంది వరకు రైతులు ఆర్గానిక్ వ్యసాయం చేస్తున్నారు. వరితో పాటుగా కూరగాయలు, నూనె గింజలు, పప్పుధాన్యాలు సాగు

చేస్తున్నారు. మరికొందరు రైతులు పండ్ల తోటలు కూడా సాగు చేస్తున్నారు. రైతులు ఈ ఆర్గానిక్ సాగు కోసం ఎలాంటి పురుగుల మందు, ఎరువులు, ఇతర కెమికల్స్ ఉపయోగించరు. కేవలం జీవ పదార్థాలతో పంటల్ని

సాగు చేస్తారు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియని పరిస్థితి. వీరు షాపులు, షాపింగ్ మాల్స్, షాపులకు ఈ ఉత్పత్తుల్ని పంపిస్తారు. ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పెద్దగా ఎగుమతి కూడా

చేయడం లేదు.ఆర్గానిక్ విత్తనాలు, ఉత్పత్తులకు 2015లో టీఎస్‌ఎస్‌వోసీఏ (తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ) ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ముందుగా రిజిస్ట్రేషన్

చేసుకోవాలి.. లైసెన్స్ వచ్చిన తర్వాత లేబుల్స్‌తో ఈ ఉత్పత్తుల్ని విక్రయించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో 200 సంస్థలు లైసెన్సులు తీసుకున్నాయి. రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే

చాలామంది రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు. కొందరు రైతులు వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి సమస్యను వివరించారు. తాము నకిలీ ఉత్పత్తుల కారణంగా నష్టపోతున్నామని

మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్‌గా యాప్ తీసుకురావాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ క్రమంలో యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.టీఎస్‌ఎస్‌వోసీఏ (తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ)

యాప్ ద్వారా సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏ రైతు, ఏ పంట సాగు చేస్తున్నారో, ఎక్కడ సాగు చేస్తున్నారో, ఆ ఉత్పత్తులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వివరాలు అందుబాటులో

ఉంటాయి. రైతుల సమాచారం (అడ్రస్, మొబైల్ నంబర్, ఫోటోలు, వీడియోలు) నమోదు చేస్తారు. ఈ యాప్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన యాప్‌ను కనెక్ట్ చేస్తారు. ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు

చేయడం.. ఎగమతుల సంస్థల వివరాలు కూడా ఉంటాయి. ఉత్పత్తులకు సంబందించిన వివరాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్