కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పై అప్పీల్
విజయవాడ, జూన్ 3
Appeal against verdict dismissing cases against Kapu activists
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాపు నేతలపై వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన కేసులపై పునర్విచారణ కోసం హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ 2016లో తుని సమీపంలో ముద్రగడ పద్మనాభం సహా ఇతర కీలక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సభ ఉద్రిక్తం గా మారిందిఅదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అటుగా వెళుతున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను తగుల పెట్టడం దేశవ్యాప్తంగా ఎంత సంచలనాత్మకంగా మారాయో తెలిసిందే. అప్పుడు అధికారం లో ఉన్న టిడిపి ప్రభుత్వం దీనిపై సీరియస్ గా స్పందించింది. సంపూర్ణ దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా ముద్రగడ సహా కేరకనేతలందరిపై కేసులు నమోదు చేసింది.మరో వైపు ఇలాంటి విషయాల్లో అత్యంత కఠినంగా ఉండే రైల్వే డిపార్ట్మెంట్ తనదైన సెక్షన్ లు నమోదు చేస్తూ విచారణ ప్రారంభించింది.అయితే 2019 అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసింది. విజయవాడలోని 7 వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ ఈ కేసులను 2021 లో కొట్టివేశారు. అయినప్పటికీ రైల్వే శాఖ తర్వాత ముద్రగడ సహా కొందరికి సమన్లు జారీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరగతోడాలని నిర్ణయించింది. క్రొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNS ) 2023 లోని యాక్ట్ నెంబర్ 46 ప్రకారం ఈ కేసు కొట్టి వేత పై పై కోర్టు కు అప్పిలుకు వెళ్లాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది. సంబంధించి రాష్ట్ర హోంశాఖ దీనికి సంబంధించిన ఆర్డర్ ను రిలీజ్ చేసింది. దీనితో ముద్రగడ పద్మనాభం సహా ఆనాటి కేసులు ఎదుర్కొన్న వారందరికీ మరోసారి న్యాయపరమైన చిక్కులు తప్పవని తెలుస్తోంది. మరి దీని పరిణామాలు రానున్న రోజుల్లో ఏవిధంగా ఉండనున్నాయో చూడాలి.