టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
Applications invited for setting up T-Seva Online Skill Centers.
హైదరాబాద్, అక్టోబర్ 06:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రాల’ ఏర్పాటుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ సెంటర్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా మరియు నగర స్థాయిలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు వివిధ రకాల డిజిటల్, బ్యాంకింగ్ సేవలతో పాటు విద్యా, ఉద్యోగ సంబంధిత శిక్షణలను అందిస్తూ అభ్యర్థులు స్వయం ఉపాధి పొందవచ్చని వెల్లడించారు.
కేంద్రాల ద్వారా లభించే ముఖ్య సేవలు:
బ్యాంకింగ్ & డిజిటల్ సేవలు: కొత్త పాన్ కార్డ్ దరఖాస్తులు, సవరణలు, బస్సు, రైలు, విమాన టిక్కెట్ల బుకింగ్, మనీ ట్రాన్స్‌ఫర్, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్, మైక్రో ఏటీఎం సేవలు, క్యాష్ డిపాజిట్లు, హెల్త్, బైక్ అండ్ కార్ ఇన్సూరెన్స్, అన్ని రకాల బిల్లుల చెల్లింపులు, కొత్త బ్యాంకు ఖాతాల ప్రారంభం.
ఉపాధి అండ్ నైపుణ్యాభివృద్ధి సేవలు: 100కి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆమోదిత స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, స్కిల్ టెస్ట్ సర్టిఫికేషన్లు, 100కి పైగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల మాక్ టెస్ట్‌లకు రిజిస్ట్రేషన్లు.
విద్యార్థులకు అవకాశాలు: డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ వర్క్‌లు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఆన్‌లైన్ కోర్సుల రిజిస్ట్రేషన్లు.
ఇతర సేవలు: కంప్యూటర్ టైపింగ్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, డాక్యుమెంటేషన్ సేవలు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ అక్టోబర్ 15, 2026.
పూర్తి వివరాల కోసం www.tsevaonline.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, లేదా 8179955744 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చని డైరెక్టర్ వివరించారు.




