నవోదయకు దరఖాస్తు చేసుకోండి.. జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి.

- Advertisement -

నవోదయకు దరఖాస్తు చేసుకోండి..
జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి.
సిద్దిపేట

Apply for Navodaya..
District Collector M. Manu Chaudhary.

వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశముకొరకు ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని  సిద్దిపేట జిల్లా కలెక్టర్  ఎం. మను చౌదరి ఒక ప్రకటనలో కోరారు. నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోరేటటువంటి అభ్యర్థులు ప్రస్తుతం  5 వ తరగతి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే చదువుతూ వుండి, అభ్యర్థుల తల్లిదండ్రుల నివాసము ఉమ్మడి జిల్లాలోనిదై ఉండాలని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏదైనా  ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గాను  ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ద్రువపత్రం, నివాస ధ్రువపత్రం, అభ్యర్థి ఫోటో మరియు అభ్యర్థి సంతకంను ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి 2024 సెప్టెంబర్ నెల 16వ తేదీ చివరి తేదీ అని, ఉమ్మడి జిల్లాలోని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు  త్వరపడి తమ తమ పిల్లలను ప్రోత్సహించి  అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రవేశ పరీక్ష 18జనవరి ,2025  శనివారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాల లో నిర్వహిస్తామన్నారు. అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు www.Navodaya.gov.in చూడాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular