Monday, December 23, 2024

బీజేపీ వైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారా..?

- Advertisement -

బీజేపీ వైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? కషాయదళంలో చేరేవారికి అడ్డంకులేంటి ?
హైదరాబాద్
రాష్ట్ర్లంలో ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని చేర్చుకుంటూ.. కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే పనిలో పడింది. తెలంగాణలో 8 లోక్ సభ స్థానాలు గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ ప్లాన్ ఏంటీ ? కేంద్ర మంత్రిగా, రాష్ట్ర సారథిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటారా ? కొత్త సారథి వచ్చే వరకు బీజేపీలో ఆపరేషన్ ఆకర్ష్ లేనట్టేనా..? అసలు బీజేపీ వైపు ఎవరైన ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? చూస్తున్న వారికి వస్తోన్న అడ్డంకులేంటి ?
తెలంగాణ బీజేపీలో మొన్నటి దాకా కేంద్రమంత్రి పదవి ఎవరికా అనే చర్చ జరిగితే ఇప్పడు అదంతా కొత్త సారధి ఎవరా అనే దాని చుట్టు తిరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీ అయ్యారు. కేంద్రమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టడమే కాకుండా కిషన్ రెడ్డికి జమ్మూకాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇంఛార్జీగా నియమించారు. దాదాపుగా 20 రోజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని ఇప్పటికే అధిష్టానానికి కిషన్ రెడ్డి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త సారథి నియామకం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్ష నియామకం జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. టీబీజేపీ పగ్గాలు ఎవరికి చిక్కుతాయో అంతుచిక్కకపోవడంతో క్యాడర్‌లో స్తబ్ధత కనిపిస్తోంది. దానికి తోడుగా పార్టీలో పాత, కొత్త వివాదం కొనసాగుతోంది. పాత నేతలకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ కార్యకర్త అనే విషయాన్ని విస్మరించవద్దని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న కాషాయ దళానికి పార్టీలో నెలకొన్న స్తబ్థత కొంత ఇబ్బందికరంగా మారింది. పార్టీ అధిష్టానం త్వరితగతిన నిర్ణయం ప్రకటిస్తే, లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునేపనిలో పడింది. ఈ సందర్భంలో బీజేపీ ఏం చేయబోతుంది..? ఆపరేషన్ ఆకర్ష్ చేపడతారా ? లేదా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ స్థానంలో నిలబడాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ పెట్టుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి ఇది క్లిష్ట సమయమనే చెప్పవచ్చు. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన 35 శాతం ఓట్లను కాపాడుకోవడం బీజేపీ ముందున్న సవాల్ . పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడానికి బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వంపై నమ్మకమున్న వారు పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఇప్పటికే రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదారుగురు బీజేపీలోకి వస్తారని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. అయితే బీజేపీ ఫోకస్ మాత్రం ఇప్పడు ఆపరేషన్ ఆకర్ష్ మీద లేదనే చెప్పాలి. కొత్త అధ్యక్షుడు వచ్చాక ఆయన చూసుకుంటారులే అన్నట్లు మిగతా నేతలు ఉన్నారు.
కాంగ్రెస్‌లో చేరలేని పరిస్థితి ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాషాయ జెండా వైపు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలంటే మాత్రం వారికి ఓ కండిషన్ అడ్డు వస్తోంది. ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలనేది పార్టీ కండిషన్. గతంలో కమలం పార్టీలో చేరిన వారంతా అలానే వచ్చి బై ఎలక్షన్ ఎదుర్కొన్నవారే. మరీ ఇప్పుడు ఆ కండిషన్ కు కాస్త బ్రేక్ ఇస్తుందా లేక రాజీనామా చేసి రావాల్సిందే అంటుందా అన్న ప్రశ్న కూడా బీజేపీ వైపు చూసే నేతలను సందిగ్ధంలో పడేసింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ఎలా చూస్తుందో వేచి చూడాలి..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్