Sunday, September 8, 2024

నువ్వా..నేనా…?

- Advertisement -

నువ్వా..నేనా…?టీడీపీ+జనసేన vs వైసీపీ….వై నాట్ 175 అంటూ గెలుపు అభ్యర్థులు ను నిర్మొహమాటంగా ఎంచుకుంటున్న వైసీపీ….వలంటరీ వ్యవస్థ తో ,పెన్షన్ పెంపుదల తో ,అమ్మవాడి తో,గెలుస్తామని వైసీపీ ధీమా?

ఆంధ్ర కి రాజధాని లేదు?..నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు?,కంపెనీ లేవు? కొన్ని సమస్యలు ఎత్తిచూపుతూ.. ప్రజలలోకి వస్తూ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న…టీడీపీ+జనసేన…?
ఇలా ఏపీ రాజకీయాలు వాడి వేడిగా ఉంటే..కొన్ని సర్వేలు…ఇరు పార్టీ లకు అనుకూలం గా సీఎం మీరే అంటే మీరే…అని రిపోర్ట్స్

ప్రజలు డిసైడ్ చేస్తారు అని రాజకీయ విశ్లేషకులు

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేంటి? అనే ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వస్తోంది.

కనీసం రాజధాని నిర్మాణం కూడా సాగలేదన్నది విపక్షాల నుంచి వస్తున్న విమర్శ.

వైసీపీ మాత్రం మళ్లీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమంటోంది.

ఎందుకో తెలుసుకుందాం.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి కారణమైన అంశాలు.. ఇప్పుడు వైసీపీ కూడా అదే విధంగా ఓడిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయా? అన్న ప్రశ్న కొంతమంది నుంచి వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత.. సీమాంధ్రను టీడీపీ అభివృద్ధి చేస్తుందన్న ఉద్దేశంతో ప్రజలు ఆ పార్టీని 2014లో గెలిపించారు. ఐతే.. అధినేత చంద్రబాబు.. అమరావతిని రాజధానిగా ప్రకటించి, తాత్కాలిక భవనాలు నిర్మించగలిగారే తప్ప.. అద్భుతమైన అభివృద్ధి ఏదీ చెయ్యలేకపోయారు. ఐతే.. ప్రజల్లో మాత్రం హైప్ బాగా పెంచారు. దాంతో.. ప్రభుత్వ పనితీరు ఆ స్థాయిలో లేకపోవడంతో.. అంచనాలు అందుకోలేకపోయిన టీడీపీ 2019 ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

హిస్టరీ రిపీట్?

2019లో 151 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ఐదేళ్లలో రాజధాని విషయంలో ఏమాత్రం ముందడుగులు వెయ్యలేకపోయింది. అసలు అమరావతిని పక్కనపెట్టి, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. పోనీ అదైనా ముందుకు సాగిందా అంటే.. లేదు. ఇలా రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీ తరహాలోనే నిరాశ పరిచింది వైసీపీ. అంతేకాదు.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా వైసీపీ ఫెయిల్ అయ్యిందనే విమర్శలున్నాయి. కంపెనీలు రాలేదనీ, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదనీ, రోడ్లు బాలేవనీ, ధరలు పెరిగాయనీ ఇలా వైసీపీ చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది.

అంశాలపై ఆశలు:

ఎన్నో సవాళ్లు ఉన్నా.. 2 అంశాల వల్ల తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ బలంగా నమ్ముతోంది. అవే సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ. గత టీడీపీ హయాంలో కూడా సంక్షేమ పథకాలు ఉన్నా, వాటి అమలు తీరు సరిగా జరగలేదు. క్షేత్రస్థాయిలో అవినీతి.. ఆ పార్టీకి చేటు తెచ్చింది. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన పాలనలో ఇలా జరగకూడదన్న ఉద్దేశంతో.. వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. ప్రతీ పథకమూ లబ్దిదారులకు చేరేలా చెయ్యడంలో వాలంటీర్లు సక్సెస్ అయ్యారు. దానికి తోడు పథకాల డబ్బును లబ్దిదారుల అకౌంట్లలో నేరుగా జమ అయ్యేలా చేస్తుండటంతో లబ్దిదారులు పూర్తి ప్రయోజనాలు పొందుతూ, మధ్యవర్తుల గోల లేకుండా పోయింది. అందుకే.. ఈ సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థే మళ్లీ తమను అధికారంలోకి తెస్తుందని వైసీపీ నమ్ముతోందని టాక్.

మొత్తంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధే కావాలి అని ప్రజలు కోరుకుంటే టీడీపీ+జనసేన కూటమి గెలుస్తుందనీ, అలా కాకుండా.. బటన్ రూపంలో సంక్షేమ పథకాల అమలు, వాలంటీర్ తరహా వ్యవస్థే కావాలని ప్రజలు కోరుకుంటే వైసీపీ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికలకు ఇంకో 3 నెలలే టైమ్ ఉంది. ఈ 3 నెలల్లో ఈ పార్టీలు తీసుకునే నిర్ణయాలు, ప్రజలకు చెప్పుకునే తీరును బట్టీ ఓటర్లు తదనుగుణంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈసారి ఎన్నికలు ఆసక్తిగా సాగుతాయనే అంచనాలు మాత్రం హైరేంజ్‌లో ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్