డబ్బువైపు ఉంటారా? ధర్మంవైపు ఉంటారా?

ఓ శక్తి… దున్నపోతులు పోటీపడలేవు
–గంగుల… నీ ఓటమి ఖాయమైంది…తప్పు కుంటే మంచిది
—ఓటుకు 20 వేలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది
—బంపర్ మెజారిటీతో బండి సంజయ్ ను గెలిపించండి
—కరీంనగర్ ప్రజలకు రాజాసింగ్ పిలుపు…
కరీంనగర్, నవంబర్ 06 (వాయిస్ టుడే): ధర్మం కోసం, ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా? అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ.20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారా? తేల్చుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అభివర్ణించారు. అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని సెటైర్లు వేశారు. బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి వేలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా బండి సంజయ్ తో రాజాసింగ్ ప్రసంగించారు. కరీంనగర్ లో పెద్దన్న బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది. మీరు ఇక్కడి నుండే సంజయన్నను ఎంపీ చేసి పార్లమెంట్ కు పంపారు. ఇప్పుడు అసెంబ్లీకి పంపుతారని భావిస్తున్న.
సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకు బండి సంజయ్ కంకణం కట్టుకుని 15 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. ఇక్కడి ఎమ్మెల్యేకు ఏది చేతగాదు… బండి సంజయ్ పోటీ చేస్తున్నడని తెలియగానే దారుస్సలాం పోయి సలాం చేసిండు. గంగుల కమలాకర్… మీ ఓటమి ఖాయమైంది. ఈ నియోజకవర్గం నుండి తప్పుకుంటే మీకే మంచిది. బండి సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు.
గంగుల అవినీతికి అంతులేకుండా పోయింది. గుడి, బడి, గ్రానైట్ సహా ఎందులో చూసినా అవినీతే.
బండి సంజయ్ వ్యక్తి కాదు.. శక్తి. ఆ శక్తిమీద పోటీ చేయాలంటే మీలాంటి దున్నపోతుల వల్ల కాదు…డబ్బు బలంతో ఆశచూపుతారు.. కరీంనగర్ ఓటర్లకు దండం పెట్టి కోరుతున్నా… మీకు డబ్బు ముఖ్యమా? ధర్మం ముఖ్యమా? ఆలోచించండి. ధర్మంవైపు నిలబడ్డ బండి సంజయన్నను గెలిపించండి
ఓటుకు 20 వేలు ఇచ్చేందుకు గంగుల సిద్ధమైండు. ఆ డబ్బుతో 5 ఏళ్లు బతకగలరా? ఆలోచించండి. అసెంబ్లీకి తెలంగాణ అసెంబ్లీకి బండి సంజయన్నను తీసుకుపోయి వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా..
ఏయ్ ఒవైసీ…. కరీంనగర్ లో ఎంఐఎం అభ్యర్ధిని పోటీ చేయించే దమ్ముందా? నీకు చేతగాక ఇంకో వ్యక్తికి మద్దతిస్తున్నవా?
మైనారిటీల్లారా…. ట్రిపుల్ తలాఖ్ తెచ్చి ముస్లిం మహిళల గర్వపడేలా చేసింది బీజేపీ. ప్రతి ఒక్క కార్యకర్త బండి సంజయన్న కోసం పనిచేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా అని అన్నారు.



