కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బీ బ్లాకులో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇంటి ఇంటి ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరేకపూడి గాంధీ .
ప్రేమ్ నగర్ బీ బ్లాకులలో గడప గడపకు తిరిగి
కొండాపూర్ డివిజన్ లో ఉత్సాహంగా గడప గడపకు ప్రచారం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరేకపూడి గాంధీ , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , యువ నాయకులు ఆదిల్ పటేల్.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు గూర్చి వివరించి ఓటర్లను అభ్యర్థించటం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధికే పట్టం కడతామని, సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి అందిన తీరును ప్రజలు మెచ్చుకుంటూ ఉన్నారని గాంధీ

అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన జన సంక్షేమ పాలన తీరుకు అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీని అన్నారు.
మన ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీ చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ గాంధీని అఖండ విజయంతో గెలిపించుకుంటామని ముక్త కంఠంతో చెబుతున్నారని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు దాదాపుగా 80% పూర్తి చేసిన ఘనత మన గాంధీకి చెల్లుతుందని ప్రచార కార్యక్రమంలో అన్నారు



