- Advertisement -

శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఉదృతం చేసింది శేర్లింగంపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఆరికపూడి గాంధి నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో ఈరోజు ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. వందల మంది కార్యకర్తలు తన వెంట రాగా గాంధీ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తనకే ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని మరోసారి గెలిచి అభివృద్ధిని ఇంతే వేగంతో కొనసాగిస్తామన్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీలు తనకు పోటీనే కాదన్నారు. ప్రజల్లో తమకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు పూలహారతులతో స్వాగతం పలుకుతున్నారన్నారు.
- Advertisement -



