బీబీనగర్ ఎయిమ్స్ సిబ్బందికి ఆయుధాల ఆవగాహనా కార్యక్రమం
యాదాద్రి
Arms awareness program for AIIMS Bibinagar staff
భువనగిరి ఏఆర్ పోలీస్ సిబ్బంది బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో సిబ్బందికి ఆయుధాల పనితీరు, వినియోగ విధానం మరియు భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయుధాలు ఎలా పనిచేస్తాయి, వాటి నిర్మాణం, భద్రతా ప్రమాణాలు మరియు నిర్వహణ విధానాల గురించి సిబ్బందికి వివరించారు. ఆయుధాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన భద్రతా నియమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆసుపత్రి సిబ్బందిలో ఆయుధాలపై సరైన అవగాహన పెంపొందించి, భద్రతా చైతన్యాన్ని కల్పించారు
ప్రజా భద్రత మరియు అవగాహన పెంపొందించడంలో యాదాద్రి భువనగిరి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆర్ఐ లతీఫ్ఉద్దీన్ , ఆర్ఎస్ఐ వెంకటేశ్ మరియు పోలీస్ అధికారులు , హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు




