- Advertisement -
రేవ్ పార్టీకి ఏర్పాట్లు..! ఇంతలోనే పోలీసులు
Arrangements for the rave party..! Meanwhile, the police
అమరావతి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం బూరుగపూడి రేవ్ పార్టీ పై సిఐ సత్యకిషోర్ కిషోర్ మాట్లాడుతూ బూరుగుపూడి నాగసాయి ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు జరిపాం. రేవ్ పార్టీకి సిద్ధమైన 5గురు యువతులు,13 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నాము. ఫెర్టిలైజర్స్ ఏజెంట్స్ కి రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు నిర్ధారణ. నూతన సంవత్సర వేడుకలకు, ఈ రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఫెర్టిలైజర్స్ ఏజెంట్ గోపాలకృష్ణ ద్వారా ఫంక్షన్ హాల్ యజమాని సత్తి రాంరెడ్డి ద్వారా 18 వేలకు ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసుకున్నారు.
సంఘటన స్థలంలో మద్యం బాటిల్, సౌండ్ సిస్టం, టేబుల్లను స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం ద్వారానే యువతులు కూడా అందుబాటులో ఉండడంతో ఫంక్షన్ హాల్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. పరారీలో ఫంక్షన్ హాల్ హాల్ యజమాని వున్నారు. 61000 నగదు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
- Advertisement -