జనగామ లో నకిలీ పోలీసుల అరెస్ట్….
Arrest of fake police in Janagama
*క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన జనగామ పోలీసులు*
ఈ రోజు జనగామ సీఐ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీపీ పార్ధసారధి మీడియా సమావేశం నిర్వహించారు,
ఈ సందర్బంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంతపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కాముని వినయ్, యామంకి మధు అనే ఇద్దరు దేవరుప్పుల మండలానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు నితిన్ అనే వ్యక్తి నిండిగొండ గ్రామానికి చెందిన తన స్నేహితుడి చెల్లెలి ఫంక్షన్ కి హాజరై తిరిగి వస్తున్నటువంటి క్రమంలో రోడ్ పై ఆపి క్రైమ్ బ్రాంచ్ పోలీసులము అంటూ కొట్టి 500 వందల రూపాయలు మరియు ఫోన్ పే ద్వారా 800 వసూలు చెసి చేయటం జరిగిందని తెలిపారు,
అనుమానం వచ్చిన సదరు వ్యక్తి స్తానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం తో పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారని ఏసీపీ తెలిపారు,
అలాగే ఎవరైనా పోలీస్ వాళ్ళము అంటూ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జనగామ ఏసీపీ.