మాగంటి ప్రధాన అనుచరుడి అరెస్ట్
హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు తన్ను ఖాన్ను మధురా నగర్ పోలీసులు అరెస్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రౌడీ షీటర్ తన్నుఖాన్ తన సహచ రులు జకీ, సలీమ్లతో కలిసి జనవరి 24న ఓ వ్యక్తిపై దాడి చేశారు. మరొక ఘటనలో లాక్డౌన్ సమయంలో నలుగురు బాధితులను ఎటువంటి కారణం లేకుండా దారుణంగా కొట్టాడు. బాధితులు భయంతో పోలీసు లకు ఫిర్యాదు చేయలేదు. నవంబర్ 2023లో ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మధురానగర్ పోలీసులు అతనిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇక మూడో కేసు లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, అలాగే ప్రభుత్వ నాలాను అక్రమంగా ఆక్రమించారని, ప్రభుత్వ స్థలంలో ఫెన్సింగ్ వేసి జంతువులను పెంచుతున్నారని తన్నుఖాన్ పై ప్రజలు, జీహెచ్ఎంసీ అధికారులు మధు రానగర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. జనవరి 20 నుంచి పరార్లోలో ఉన్న తన్నుఖాన్ను విశ్వసనీయ సమాచారం మేరకు మధురానగర్ పోలీసులు శని వారం మాదాపూర్లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరి చారు. మేజిస్ట్రేట్ అతనికి మే 4వ తేదీ వరకు రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు.
మాగంటి ప్రధాన అనుచరుడి అరెస్ట్
- Advertisement -
- Advertisement -