Saturday, February 8, 2025

అరెస్ట్ చేస్తున్నారు… వదిలేస్తున్నారు… కేటీఆర్ కు సేమ్ ఫార్ములా

- Advertisement -

అరెస్ట్ చేస్తున్నారు… వదిలేస్తున్నారు…
కేటీఆర్ కు సేమ్ ఫార్ములా

Arresting... releasing...
Same formula for KTR

హైదరాబాద్, జనవరి 16 (వాయిస్ టుడే )
తెలంగాణ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో .. లేకపోతే వ్యూహం లేక వ్యవహరిస్తున్నారో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. కొన్ని కేసుల్లో బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేస్తున్నారు.కానీ వారిని జైలుకు పంపడం లేదు. వారిపై బెయిలబుల్ సెక్షన్లు మాత్రమే పెడుతున్నారు. దాంతో రిమాండ్ కు పంపేందుకు జడ్జిలు తిరస్కరించి బెయిల్ ఇస్తున్నారు. ఇలా  హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిని చాలా సార్లు అరెస్టు చేశారు.కానీ బెయిలబుల్ సెక్షన్లే పెట్టారు.అరెస్టు చేసిన అన్ని సార్లు బయటకు వచ్చారు. ఓ సారి ఎర్రోళ్ల శ్రీనివాస్ నూ అరెస్టు చేశారు ఆయనకు బెయిల్ …రిమాండ్ కు వెళ్లకుండానే లభించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్, పాడికౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పేరుతో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పాడికౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ లోనే హంగామా చేశారు. పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. తర్వాత కరీంనగర్‌లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్  తోనూ అంత కంటే ఎక్కువగా ప్రవర్తించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా అలాగే చయడంతో అరెస్టు చేశారు. వీరెరిపైనా కఠినమైన సెక్షన్లు పెట్టలేదు. కానీ అరెస్టులు చేశారు. అలాంటి సెక్షన్లతో రిమాండ్‌కు పంపరని ఆ పోలీసులకు తెలియదా అంటే.. తెలియదని ఎలా అనుకోగలం. మరి ఎందుకు అలా చేస్తున్నారు ?. ఇదే సందేహం బీఆర్ఎస్ నేతలకూ వస్తోంది. తమను జైలుకు పంపాలంటే పెద్ద విషయం కాదు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ వ్యవహారశైలి భిన్నంగా ఉంది. ఆయన నేరుగా ముఖ్యమంత్రిని ధూషిస్తున్నారు. ఇతర వ్యవహారాల్లో దాడులకు తెగబడినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఓ ముఖ్యంత్రిని దూషిస్తే..ఏదో ఓ కేసులో అరెస్టు చేయడం పెద్ద విషయం కాదు. అలా చేస్తారని తెలిసిక కూడా పాడి కౌశిక్ రెడ్డి దూకుడుగా ఉంటున్నారు. అంటే కాంగ్రెస్ ను రెచ్చగొడుతున్నారని అనుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు.. పాడికౌశిక్ రెడ్డి కలిసి..అరెస్టుల కోసం వ్యూహం పన్నినట్లుగా భావిస్తున్నారు.అందుకే అరెస్టులు చేస్తున్నారు కానీ జైలు వరకూ వెళ్లనీయడం లేదని.. ఆ తర్వాత జరిగే రాజకీయానికి అవకాశం లేకుండా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇదే ప్లాన్ ను రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ విషయంలోనూ పాటిస్తోంది. ఎన్నో రోజులుగా ఇదిగో కేటీఆర్ అరెస్టు..అదిగో కేటీఆర్ అంటున్నారు కానీ ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. కేటీఆర్ ను అన్ని రకాల న్యాయపరమైన అవకాశాల్ని ఉపయోగిచుకునేలా చేశారు. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. ఎప్పుడు అరెస్టు చేస్తారోనని కేటీఆర్ కూడా వెయిటింగ్ చేస్తున్నారు.దానికి తగ్గట్లుగా రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుందని చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రిలీఫ్ ఇవ్వకపోవడంతో ఆయనను అరెస్టు చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు.కానీ ఎప్పుడు అరెస్టు చేస్తారన్నది సస్పెన్స్ గానే ఉంది.  మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ అరెస్టుల వల్ల పొలిటికల్ లాస్ లేకుండా… ఇతరులకు పొలిటికల్ గెయినింగ్ లేకుండా చూసేలా వ్యూహం పన్నుతోందని అనుకోవచ్చు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్