- Advertisement -
నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం
Arya Vaishya family goes missing in Nandyala district centerకుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల
నంద్యాల
నంద్యాల టౌన్ లో ఒక కుటుంబం అదృశ్యం అయింది. కుటుంబ జీవనం కోసం దుకాణాలను అద్దెకు ఇస్తే ఆరు నెలలుగా బాడుగ చెల్లించకుండా బెదిరింపులకు దిగుతున్నారని నాగరాజు వాపోయాడు. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని సెల్ఫీ వీడియో విడుదల చేసాడు. తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగించారు. కొద్ది రోజుల నుంచి నాగరాజు కుటుంబసభ్యుల ఫోటోలు, వీడియోలు తీసి తప్పుగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని వేధింపులకు గురి చేపారని అన్నాడు. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసి పోయిన నాగరాజు కుటుంబం, దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపించింది. దుకాణాలు 2022 లో నిర్మాణం జరిపితే 2018 లో బాడుగకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆరోపించారు. నాగరాజు వీడియో బయటకు రావటంతో ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో నాగరాజు ఆచూకీకోసం వివరాలు సేకరిస్తున్నారు.
- Advertisement -




