- Advertisement -
నీట మునిగిన అనంతారం బ్రిడ్జి
నేరెళ్ళ వాగు రోడ్డు పై నుండి ఉదృతం గా ప్రవహిస్తుంది
జగిత్యాల జిల్లా బ్యూరో (జులై 27,23)వాయిస్ టుడే:జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారి పై అనంతారం వాగు పొంగి పోర్లడం తో రాకపోకలు నిలిపివేశారు. దీనికి తోడు నేరెళ్ళ వాగు రోడ్డు పై నుండి ఉదృతం గా ప్రవహిస్తుంది.అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయం గా వివిధ మార్గంల లో ప్రయాణ ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు తగిన చర్యలు తీసుకోని వాగులపై నూతన బ్రిడ్జి నిర్మాణం లు త్వరగా నిర్మించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
- Advertisement -