అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నేటి నుంచి భారీ ఆర్మీ ర్యాలీ
విశాఖపట్నం :
నేటి నుంచి . సెప్టెంబర్ 5 వరకూ 11 రోజులు పాటు జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టనున్నారు.
పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులుకు పరుగు, శారీరక పరీక్షలు నిర్వహించ నున్నారు.
8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేపట్టనున్నారు.
విశాఖ పోర్టు స్టేడియానికి అర్థరాత్రి నుంచి అభ్యర్థులు చేరుకున్నారు. గేటు వద్ద పడిగాపులు.
ప్రారంభమైన ఆర్మి ర్యాలీ.
విశాఖ ఆర్కే బీచ్ లో పరుగు లో నెగ్గిన అభ్యర్థులను విశాఖ పోర్టు స్టేడియానికి తరలిస్తున్న ఆర్మీ అధికారులు.
మిగిలిన శరీర దారుడ్య పరీక్షలు విశాఖ పోస్ట్ స్టేడియంలో నిర్వహించేందుకు బస్సులలో తరలిస్తున్న ఆర్మీ అధికారులు


