సీటు లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరనస

- Advertisement -

సీటు లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరనస

As there was no seat, MLA Madhavi stood and protested

                కడపలో ఉద్రిక్త వాతావరణం
అమరావతి డిసెంబర్ 23 )
కడపలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేదికపై మేయర్‌ సురేష్ బాబుకు మాత్రమే కార్పొరేషన్‌ సిబ్బంది కుర్చీ వేశారు. సీటు లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరనస తెలిపారు. ఎమ్మెల్యే మాధవి భారీ

అనుచర వర్గంతో ర్యాలీగా కడప కార్పొరేషన్‌ చేరుకున్నారు. కార్పొరేషన్‌ గేట్ వద్ద టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టిడిపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.కాసేపట్లో కడప మున్సిపల్‌

కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం కానుంది. కార్పొరేషన్‌ కార్యాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ముందస్తుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ దగ్గర 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు ర్యాలీలు, సభలను

పోలీసులు నిషేధించారు. వేదికపై కుర్చీకోసం వైసిపి, టిడిపి మధ్య యుద్ధం నడుస్తోంది. అప్పట్లో వాయిదాపడిన సమావేశాన్ని అధికారులు ఇవాళ నిర్వహిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular