ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
బద్వేలు
ASHA workers should be recognized as government employees
ఆశా కార్యకర్తల సమావేశం సోమవారం బద్వేల్ పట్టణంలోని జేవి భవనం నందు నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఆశ కార్మికులకు పిలుపునిచ్చారు ఈ ధర్నా సందర్భంగా కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోవాలని అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో మేరకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ లను అమలు చేయాలని నాణ్యత కలిగిన యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని వారు ఆశా కార్మికులకు పిలుపునిచ్చారు 22వ తేదీన జరగబోయే కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం ఆశా కార్మికులందరూ పాల్గొని ఈ ధర్నాని జయప్రదం చేయాలని వారు తెలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ ఏఐటీయూసీ జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మరియమ్మ శాంతమ్మ ఆశా వర్కర్స్ ధనమ్మ శ్యామల వెంకటసుబ్బమ్మ లక్ష్మీదేవి నవమ్మ తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు,


