- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని మేడ్చల్ భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆ షాక్ నుంచి తానింకా తేరుకోలేదన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించిన ఆయన… గతంలో ఇద్దరం తెదేపాలో కలసి పని చేశామని గుర్తు చేశారు. రాజకీయ చర్చకు తావు లేకుండా సీఎంను కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానని తెలిపారు. ‘‘మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలని మా పార్టీ నేతలు అడిగారు. నా కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరా’’ అని మల్లారెడ్డి చెప్పారు
- Advertisement -