Sunday, September 8, 2024

కులవృత్తుల వారికి లక్ష రూపాయల సహాయం

- Advertisement -

సికింద్రాబాద్ ::  కులవృత్తుల వారు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ప్రభుత్వము లక్ష రూపాయల సహాయం అందించి వారిని ప్రోత్సహిస్తుందని డిప్యూటీ స్పీ కర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి డివిజన్లో 300 మంది లబ్ధిదారులకు బీసీ బందు పథకం ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలు అందరు సంతోషంగా ఉండాలని లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని పద్మారావు గౌడ్ అన్నారు. బీసీ బంద్ పథకము ఒకేసారి పూర్తి కాదని దశలవారీగా లబ్ధిదారులకు చెక్కులను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా నియోజకవర్గానికి 3,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు వివిధ దశలలో లబ్ధిదారులకు వస్తాయని పద్మారావు గౌడ్ తెలిపారు. బీసీ బందు పథకము రానివారు నిరుత్సాహ పడవద్దని, దశలవారీగా పథకము అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని ఆయన అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కార్పొరేటర్లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Assistance of one lakh rupees to caste workers
Assistance of one lakh rupees to caste workers
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్