- Advertisement -
లిమ్స్ ఆసుపత్రిలో దారుణం
Atrocity in Lims Hospital
ఓ పాజిటివ్ రక్తానికి కి బదులుగా ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించిన వైద్యులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం
ప్రాణాపాయ స్థితిలో 23 ఏళ్ల మహిళ
రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు చేసిన నిర్వకానికి ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన ఐతరాజు మేఘన అలియాస్ శోభ(23) అనారోగ్యంతో ఆగస్టు 16న లిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తం ఎక్కించాలని తెలిపి ఆమెకు రక్తం ఎక్కించారు. ఆ తర్వాత 17 వ తేది ఆరోగ్యం మెరుగైందని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత 23వ తేదీన మరల ఆరోగ్యం క్షిణించడం తో హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తం ఇన్ఫెక్షన్ అయినట్లు పేర్కొన్నారు. ఎందుకు అలా జరిగిందని ఆరా తీయడంతో ఇబ్రహీంపట్నం లిమ్స్ ఆసుపత్రి వారు రోగిది ఓ పాజిటివ్ రక్తం కాగా ఆమెకు ఏబీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్లు తేలింది.
ప్రస్తుతం బాధితురాలు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై బాధితురాలి భర్త ఆసుపత్రి పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలని, ఆసుపత్రి స్టాఫ్ నిర్వకంపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో డిమాండ్ చేశాడు
- Advertisement -