- Advertisement -
విశాఖలో దారుణం: బస్సులో మహిళలపై యాసిడ్ దాడి?
Atrocity in Visakha: Acid attack on women in bus?
విశాఖపట్నం
విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు. గిరిజాలకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో ప్రయాణి స్తున్న ముగ్గురు మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, స్థానికుల సాయంతో బాధి తులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు.సమాచారం అందు కున్న కంచరపాలెం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడ్ కాదు ఇతర ద్రావణమా’ అనే దానిపై పరీక్షలు జరుగు తున్నాయని తెలిపారు.ఘటన స్థానికులలో తీవ్ర కలకలం రేపు తోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడి వెనుక కారణాలు మరియు నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -