- Advertisement -
ఉపాధ్యాయుడు పై దాడి చేయడం అమానుషం.
Attacking a teacher is inhumane.
కమాన్ పూర్
ఉపాధ్యాయుడిపై దాడి చేయడం సమావేశం అని పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు గసిగంటి రమేష్ అసోసియేట్ అధ్యక్షుడు రాజమౌళి గౌడ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయునిపై దాడికి నిరసనగా సోమవారం కమాన్ పూర్ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంబాలపల్లి రాములు పై గత నెల 23న కొందరు వ్యక్తులు బడిలోకి చొరబడి విచక్షణారహితంగా మూక దాడికి పాల్పడిన ఘటనను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి ఆ దాడిని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పిఆర్టియు టిఎస్ కమాన్ పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఐ విజయకుమార్ మండల అధ్యక్షులు గసిగంటి రమేష్ , జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేరుగు రాజమౌళి, రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు మరియు సీనియర్ సభ్యులు రజనీ వందన , లక్ష్మీనారాయణ,సతీష్, రాజేశ్వరరావు, నఫీజులా ఖాన్, ఈశ్వరయ్య, నంబయ్య, రజిత కుమారి, సరళ, రేణుక తదితరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -