ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద సంస్థ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 5 వేల రాకెట్లతో ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్‌లో 40 మంది పౌరులు చనిపోయారు. 750 మంది గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. తమ ప్రాంతంలోని గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 161 మంది చనిపోయారని పాలస్తీనా ప్రకటించింది. ఇరువైపులా దాడులతో మొత్తం 201 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇక ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని భారత్ ఖండించింది.పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూపు మెరుపుదాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దును దాటి దేశంలోకి చొరబడ్డారు. సెరాట్ ప్రాంతంలో వాహనంలో వెళ్తూ కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.