వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం
Attempted nudity with a girl in the dormitory
పెద్దపల్లి – మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది.
అయితే వసతి గృహంలో పనిచేసే వంట మనిషి.. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని యువతికి మాయ మాటలు చెప్పింది.
వారం క్రితం వంట మనిషి పర్సనల్ రూంకు ఓ వ్యక్తిని తీసు కువచ్చి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉంటే ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పింది.
దీంతో ఆ విద్యార్థిని భయంతో హాస్టల్ నుంచి మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులుగా తలదాచుకున్నది.
తల్లిదండ్రులకు విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు వచ్చి సదరు వంట మనిషిని నిలదీశారు.
విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు..