Tuesday, October 22, 2024

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

- Advertisement -

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ
పెద్దపల్లి ప్రతినిధి:

మాదక ద్రవ్యాలతో సహా ఇతర చెడు అలవాట్లకు  పూర్తి స్థాయిలో దూరంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ అన్నారు.
బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భం గా ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ మాట్లాడుతూ  మాదక ద్రవ్యాల వాడకం వల్ల మన  ఆరోగ్యం పాడవడంతో పాటు చట్టప్రకారం శిక్షార్హులమవు తామని అన్నారు.  గంజాయి, డ్రగ్స్, మొదలగు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి చిన్నతనం నుంచి పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్న వయస్సులో పిల్లలు, యువకులు కొత్త అలవాటు ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం ప్రారంభిస్తారని, ఒకసారి మాదకద్రవ్యాలు అలవాటైతే  దానికి బానిసలుగా మారుతారని అదనపు కలెక్టర్ తెలిపారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను పోషించాలని, మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న వారి సమాచారం అందించా లని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. విద్యార్థుల ప్రవర్తనను గమనించి ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని, మాదకద్రవ్యాల అంశం చాలా కీలకమైన అంశమని ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలను నాశనం చేసే అవకాశం డ్రగ్స్ కు ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి జూనియర్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, గంజాయి మొదలగు మాదకద్రవ్యాల  వినియోగం వల్ల కలిగే నష్టాలను, చట్ట ప్రకారం పడే శిక్షలను  వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ  డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల లివర్, కిడ్నీ, నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుందని, డ్రగ్స్ కు అలవాటు పడిన వారు అధికంగా నిరాశ నిస్పృహలకు లోనుకావడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం, అసాధారణమైన ప్రవర్తన కలిగి ఉండటం జరుగుతుందని తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారికి చికిత్స అందించేందుకు రామగుండం జనరల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేశామని, పెద్దపల్లి ఆసుపత్రిలో సైతం అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞను అదనపు కలెక్టర్ చేయించి, మాదక ద్రవ్యాలకు నో చెప్పండి అనే పోస్టర్ ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించా రు. అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాడిన పాటలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్  ఆర్. మహిపాల్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ.సురేష్, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ సంబంధిత అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్