బెస్ట్ మెకానిక్ కు ఘన సత్కారం.
Award recognization to the best mechanic.
రామగుండంలో 43 సంవత్సరాలు పేద ఆటో డ్రైవర్లకు సహాయం.
రామగుండం :
రామగుండం :
స్థానిక గోదావరిఖని హనుమాన్ నగర్ లోని జనతా గ్యారేజ్లో 43 సంవత్సరాలు ఆటో మెకానిక్ మాణిక్యాల సదానందం రెడ్డి ఎంతోమంది పేద ఆటో డ్రైవర్లకు అండగా ఉంటూ తక్కువ ధరలో వారికి ఆటోలు రిపేరు చేయడమే కాకుండా ఆటో డ్రైవర్లకు ఆపదలో ఉన్నవారికి నేను ఉన్నానంటూ తనవంతుగా సహాయం అందిస్తూ రామగుండం ఆటో యూనియన్లు కు అండగా ఉంటూ వారికి ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. రామగుండం లోని ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు బజాజ్ డీజిల్ ఆటో మెకానిక్ సదానందం రెడ్డి సేవలను గుర్తించి మాణిక్యాల సదానందం రెడ్డికి రామగుండం ప్రాంతం ఆటో బెస్ట్ మెకానిక్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
సోమవారం నాడు హనుమాన్ నగర్ లోని జనతా గ్యారేజ్ లో ఆటో డ్రైవర్ లంతా శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనతా గ్యారేజ్ ఆటో స్టోర్ యజమాని గడ్డం మల్లేష్ ఆటో డ్రైవర్లు ముని గాల నరేష్ అజ్జు మెకానిక్ శనివారపు రవీందర్, ఆంటోనీ, జే రాజలింగం ఎండి అసద్ అలీ , ఎండి ఫీర్ మహ్మద్,ఎండి సమీర్ , రోడ్డ శంకర్, గుర్రం రమేష్, ఎంఏ అజార్ , ఎం. శ్యామ్, బి శేఖర్, ఎస్.కె అక్బర్, ఈ మల్లేష్,వి సంపత్, వి భాస్కర్, ఆడెపు రవి,గడ్డం రవి, జెట్టి సాయిలు తదితరులు పాల్గొన్నారు.