మధ్యాహ్న భోజన పథకం పై చైర్మన్లకు అవగాహన సదస్సు
Awareness conference for chairmen on lunch scheme
సి. బెలగల్
సి.బెళగల్ మండలంలోని స్థానిక మహిళా భవన్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంపై అవగాహన కల్పించడానికి ఏర్పాటుచేసిన సమావేశానికి మండల ఎంఈఓ జ్యోతి, ఆదం భాష, మండల విస్తరణ అధికారి సందీప్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో మండలంలోని ఎంపీపీ, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,స్కూల్ కమిటీ చైర్మన్లు,పాల్గొన్నారు. ఎంఈఓ ఆదం భాష మాట్లాడుతూ, గత ప్రభుత్వం అమలు చేస్తున్న మెనును మార్చాలని మెనూ మార్చడానికి కూడా అందరి ఆమోదం ఉండాలని, ఈ ప్రభుత్వం యొక్క ద్వేయమన్నారు, భోజన పథకంలో 650 నుంచి 850 వరకు పోషక క్యాలరీలు ఉండాలని, ప్రాంతానికి బట్టి కొన్ని ప్రాంతాలలో, దొండకాయ చట్నీ, రాయలసీమ ప్రాంతాలలో టమోటా లేదా వంకాయ చట్నీలు చేయాలని సూచించారు, కోడిగుడ్డు ప్లేసులో, అరటిపండు, లేదా జామ పండు పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాఠశాలను స్కూల్ కమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, వెల్ఫేర్ అసిడెంట్లు, అందరూ సమిష్టిగా పాఠశాలను అభివృద్ధి పథంలో నడపాలని తెలియజేశారు, వారంలో సోమవారము, గురువారము వెల్ఫేరె అసిస్టెంట్ భోజనాన్ని, బాత్రూములను పరిశీలించి ఆప్ లో అప్లోడ్ చేయాలని, అలాగే బుధవారము శుక్రవారం కూల్ కమిటీ చైర్మన్లు భోజన పథకాన్ని, బాత్రూంలో క్లీనింగ్ ను పరిశీలించాలని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని తెలిపారు. మండల విస్తరణ అధికారి సందీప్ మాట్లాడుతూ*ప్రతి పాఠశాలలో బడి బయట బడి లోపల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వంటగదిని, వంట చేసే మనసులు పరిశుభ్రంగా ఉండాలని, పాఠశాలలో ఉండే ఆయా, రోజుకు నాలుగుసార్లు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని. ఉదయం 8 గంటలకు, 11 గంటలకు మధ్యాహ్నం ఒంటిగంటకు, మూడు గంటలకు ఒకసారి పాఠశాలను శుభ్రపరచాలని ఆదేశించారు, పాఠశాలలో నేటి సదుపాయం లేకపోతే మా దృష్టికి తీసుకువస్తే గ్రామపంచాయతీ సమక్షంలో స్కూలుకు నేటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ జ్యోతి, ఆదం భాష, మండల విస్తరణ అధికారి సందీప్, అన్ని పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు స్కూల్ కమిటీ చైర్మన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వంట సిబ్బంది, మొదలగువారు పాల్గొన్నారు.