- Advertisement -
బాల్య వివాహాల నుండి విముక్తికై అవగాహన సదస్సు
Awareness conference for freedom from child marriage
కరీంనగర్
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కే వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల సుభాష్ నగర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులకు బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల కార్మికుల, సైబర్ నేరాలు మరియు వివిధ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు బాల్యవివాహాలను నిరోధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఒకవేళ బాల్యవివాహాల గురించి సమాచారం అందించవలసిందిగా కోరారు, బాల్యవివాహాలను అరికట్టడానికి విద్యార్థినీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నగరంలోని వృద్ధుల, వికలాంగుల ఆశ్రమము, స్వాదార్ హోమ్ ను సందర్శించారు, ఎలాంటి న్యాయపరమైన లేదా న్యాయ సేవ అవసరమైన సంప్రదించవలసిందిగా నిర్వాహకులను ఆదేశించారు, ఈ సందర్భంగా వృద్ధుల, వికలాంగుల ఆశ్రమంలో మరియు స్వాధార్ హోమ్ లో పండ్ల పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పాటు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, వృద్ధాశ్రమము, స్వాధార్ హోం సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -