ఆశా వర్కర్లకు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమం

- Advertisement -

ఆశా వర్కర్లకు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమం

Awareness program on HIV and AIDS for Asha workers

మాచవరం,
మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆషాడే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ సీత మహాలక్ష్మి మాట్లాడుతూ, ప్రతినెల మొదటి మంగళవారం ఆషాడే కార్యక్రమం నిర్వహిస్తారని ఆమె అన్నారు. పీహెచ్ ఎన్ రోజ్ మేరీ మాట్లాడుతూ, ఆశ డే సందర్భంగా ఆశాలకు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పౌష్టికాహారం, న్యూట్రిషన్, పలు కార్యక్రమాల గురించి ఆశాలకు వివరించడం జరిగిందని ఆమె అన్నారు. ప్రతి నెలలో ఆశా వర్కర్లు చేసే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular