నూతన పోలీస్ చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

- Advertisement -

నూతన పోలీస్ చట్టాలు, సైబర్ నేరాలు, సామాజిక అంశాల పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల,

పోలీస్ చట్టాలు, సైబర్ నేరాలు సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విధంగా పోలీస్ కళాబృందం మరింత చురుకుగా పనిచేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కళాబృందం సభ్యులు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరుగుదలతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుందని ఈ సైబర్ నేరాలు నివారణ గురించి ప్రజలకు అవగాహన పరచాలని అదేవిధంగా పోలీస్ చట్టాలు, సిసి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత, మూఢనమ్మకాలు నివారణ, డయల్ 100 యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించే విధంగా చూడాలని కళ బృంద సభ్యులకు ఎస్పీ సూచించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular