Saturday, February 21, 2026

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా  అవగాహన

- Advertisement -

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా  అవగాహన

జగిత్యాల
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బతకపల్లి గ్రామంలో పోలీస్ కళా  బృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహణ, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు..ఆనంతరం
ఎస్.ఐ సతీష్ మాట్లాడుతూ నేను సైతం అనే కార్యక్రమం ద్వారా  పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే  తెలుస్తోందని తెలిపారు,  సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.
తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు ,యూత్ చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని
,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని,  లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్  ఆవశ్యకత గురించి వివరించారు. గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్  స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో  చిన్న చిన్న తగదలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్, పోలీసు సిబ్బంది,  గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్