Monday, February 16, 2026

అయన ఎగవేతల రేవంత్ రెడ్డి

- Advertisement -

అయన ఎగవేతల రేవంత్ రెడ్డి

Ayana Egavethala Revanth Reddy

మాజీ మంత్రి హరీష్ రావు
వనపర్తి
పదివేల మంది స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారనే దానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం నాడు వనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో అయన పాల్గోన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ  కొత్త పథకాలు రాలేదు, పథకాలు బంద్ పెడుతున్నడు.  బతుకమ్మ చీరెలు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, చెరువుల్లో చేప పిల్లలు లేవు. బి ఆర్ ఎస్ ప్రశ్నిస్తుంది కనుక ఆ మాత్రం అయినా చేస్తున్నరు. వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు అవుతుందా. అయితే దేవుని మీద వొట్లు అడిగితే తిట్లు. తిట్లతో పాటు కేసులు కూడా ఉన్నాయి. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, చంద్రబాబు, వైఎస్ మీద పోరాటం చేసినోళ్ళం. డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ చేస్తా అన్నడు చెయ్యలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పంద్రాగస్టు వరకు చేస్తం అని మాట తప్పారు. ఈయన చెబితే నమ్మరని దేవుళ్ళ మీద వొట్లు వేసిండు. కురుమూర్తి, జోగులాంబ అమ్మవారు, లక్ష్మి నరసింహ స్వామీ మీద వొట్లు వేసి మాట తప్పారు. 45 వేల కోట్లు అని, 29 వేల కోట్లు అని, 17 వేల కోట్లు చేసినట్లు ప్రచారం చేశారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని అన్నారు,.
కేసీఆర్   అందరికీ రైతు బంధు ఇస్తే నిబంధనలు పెట్టీ రుణమాఫీ ఎగవేశారు. పాలకుడు దేవుళ్ళ మీద వొట్లు పెట్టీ మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం అవుతుందని నేను దేవుడి దగ్గరకి వెళ్ళాను. ప్రజల్ని కాపాడు, పాపాత్ముడిని క్షమించు అని వేడుకున్నా. దానికి కూడా నా మీద కేసులు పెట్టారు. మోసం చేసినవు నీ పేరు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నాను. పది నెలలు అయ్యింది మ్యానిఫెస్టోలో చెప్పినవి అమలు చేయలేదు అంటే బేగం బజార్ పోలీదసు స్టేషన్ లో కేసులు పెట్టారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నీ హామీలు అమలు చేసేదాకా నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాను. బేగం బజార్ కాదు ఏ బజార్ లో కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. మూసి పేరిట లక్షా 50 వేల కోట్లు అంటున్నాడు కానీ రైతులకు రైతు బంధు ఇచ్చేది లేదు. రైతు బంధు ఇవ్వాలంటే ఊకుందామా ఊరికిద్దామా? రైతు బంధు, రుణమాఫీ, బీమా పేరిట లక్షా 50 కోట్ల రూపాయలు కేసీఆర్ రైతులకు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేసిండని ఆరోపించారు.
అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, సన్నాలకు అని మాట తప్పాడు. డెడ్ లైన్, పేపర్ హెడ్ లైన్ మరినయి, రుణమాఫీ ఒక లైన్ లోకి రాలేదు. ఒకప్పుడు దీన్ని వలసల వనపర్తి అనేవారు. మేము వచ్చాక బుద్దరం బ్రాంచ్ కెనాల్, ఘనపురం తవ్విచ్చినం.కేసీఆర్ గారు వలసల వనపర్తిని వరికోతల వనపర్తి అయ్యింది. ఇంజినీరింగ్ కాలేజి, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు.  వనపర్తిని సరస్వతి నిలయం చేసింది నిరంజన్ రెడ్డి. పది నెలల కాలంలో వనపర్తిల పైసా పని అయ్యిందా? అన్ని వర్గాలను రోడ్ల మీదకు తెచ్చిండు. జివో 29 తెచ్చి ఎస్సీ, ఎస్టీ లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నడు . అన్యాయం అంటే పిల్లల ఈపులు పగల కొడుతున్నడు. ప్రజా పాలన అన్నడు. అర్థరాత్రి విద్యార్థులను గొడ్డును కొట్టినట్లు కొట్టిస్తున్నారు. పోలిసొల్లను నమ్మడం లేదు. స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారు. ముఖ్యమంత్రిగా వారి సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యారు. పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు.
రైతులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు.అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు.

కరెంట్ బిల్లులు పెంచవద్దని కోట్లడితే పెంచలేదు. బి ఆర్ ఎస్ పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది. అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తా. మహిళలకి 2500 మహాలక్ష్మి, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు చెప్పినట్లు హామీలు ఇవ్వాలి  అక్రమ కేసులకు భయపడేది లేదు. తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేశాం. 480 మందికి స్తే తెచ్చాం ఇల్లు కులగొట్టకుండా. మేము అండగా ఉంటాం.  అతి చేస్తున్న పోలీసుల పేర్లు డెయిరీలో రాస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్