ఖమ్మం చేరుకున్న అయోధ్య అక్షింతలు
ఖమ్మం
అయోధ్య రామ మందిర అక్షింతలు ఖమ్మం చేరుకున్న సందర్భంగా ఖమ్మం నగర వీధుల్లో హిందూ సంఘాలు,రామ భక్తులు భారీ శోభాయాత్ర నిర్వహించారు.కాషాయ వస్త్రాలు, ధ్వజాలు ధరించి కోలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు.రాత్రి NSP రామాలయం చేరుకున్న స్వామివారి అక్షంతలు జిల్లా విశ్వహిందూ పరిషత్ అద్యక్షుడు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో కల్వొడ్డు ఆంజనేయ స్వామి దేవాలయనికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత కాల్వొడ్డు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి అయోధ్య రామయ్య అక్షంతల శోభాయాత్రను త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. అశ్వవాహన రథంపై స్వామి వారి అక్షంతల కలశం వుంచి గాంధీ చౌక్ ,కమాన్ బజార్ ,పాత బస్ స్టాండ్,వైరా రోడ్డు జిల్లా పరిషత్ మీదుగా జలాంజనేయ స్వామి దేవాలయనికి శోభాయాత్ర చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో దివ్యమైన రామాలయ నిర్మాణం చేసి జనవరి నెలలో ప్రారంభించనున్నారని ఈ బృహత్తర కార్యక్రమం లో ప్రజలందరూ పాల్గొనాలనే సంకల్పంతో అన్ని ప్రాంతాలలో ఈ శోభా యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. ఖమ్మంలో ఈ యాత్ర ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా వుందని జై శ్రీరామ్ అనే నినాదాలతో ఖమ్మం వీధులు మారుమోగాయి. ఈ యాత్రకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం చేరుకున్న అయోధ్య అక్షింతలు
- Advertisement -
- Advertisement -



