అయోధ్య రామమందిరం పనులు
భైంసా
పూర్తి కావస్తున్న తరుణంలో వచ్చే ఏడాది జనవరిలో రామ విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే గ్రామగ్రామాన మందిరానికి సంబంధించిన అక్షింతల ఊరేగింపు జరుగుతుంది. మంగళవారం భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ నుండి ప్రధాన రహదారి గుండా ఆర్ఎస్ఎస్, విశ్వహిందు పరిషత్, హిందూ సంఘాలు, రామభక్తులు, యువకులు పెద్ద ఎత్తున హాజరై సంస్కృతిక, భజన కార్యక్రమాలు, మహిళల హారతులతో ఊరేగింపు ర్యాలీగా వెళ్తూ, ఓల్డ్ సిల్వర్ మర్చంట్ సమీపంలోగల వెంకటేశ్వర స్వామి దేవాలయం చేరుకుని పూజలు చేశారు.ఈ ప్రత్యేక పూజలకి స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. యావత్ హిందూ సమాజం కలలు కన్నా రాముని గుడి నిర్మాణం పూర్తి అయిందని, వచ్చే జనవరి 22 ను అయోధ్యలో శ్రీరాముని స్థాపనని హిందుపండగలైన దీపావళి, ఉగాది, దసరాలా జరుపుకోవాలని, పిల్లలకు మన వేదాలు, మహాభారతం, రామాయణం ఇతిహాసాలు నేర్పి శ్రీరామునిలా ఆదర్శ వంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం వాడవాడలా అక్షింతలను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు.
అయోధ్య రామమందిరం అక్షింతలను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు.
- Advertisement -
- Advertisement -