Friday, October 18, 2024

అజారుద్దీన్ కు తీవ్రమవుతున్న ఇంటిపోరు

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 31, (వాయిస్ టుడే  ): టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు తెలంగాణలో ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. సీటు దక్కినా విజయం వరించేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీహిల్స్‌ నుంచి టికెట్ దక్కించుకున్నా.. విజయం మాత్రం నల్లేరుపై నడక కాదు అనే అభిప్రాయ పడుతున్నారు. జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌, ఖైరతాబాద్‌ అభ్యర్థిగా పీజేఆర్‌ కుమార్తె పి.విజయారెడ్డికి టికెట్ దక్కింది. మరోవైపు అధిష్టానం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించారు.“కొంతమంది హాఫ్‌టికెట్లకు టికెట్‌ ఇచ్చినప్పుడు తనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మానాన్న మెడలో కాంగ్రెస్ జెండా ఉంటే ఇది మా రక్తం అని అనుకునే వాళ్ళం.. కానీ ఈ రోజు ఇలాంటి పరిస్తితి వస్తుందని ఊహించలేదన్నారు. నాకు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ.. నేను బీ ఆర్ ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నా.. గాంధీ భవన్ అమ్ముడుపోతుంది.

Azharuddin has a growing family feud
Azharuddin has a growing family feud

కేసిఆర్‌తో చాలా సేపు మాట్లాడాను. నేను త్వరలో బీ ఆర్ ఎస్ లో చేరుతున్నాను” అంటూ ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాజకీయం ఆసక్తి కరంగా మారింది.పీజేఆర్‌ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం తర్జన భర్జన పడింది. జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌ నుంచి పి.విజయారెడ్డి దివంగత నేత కుటుంబం నుంచి టికెట్‌ ఆశించారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై స్ర్కీనింగ్‌ కమిటీ పలుమార్లు చర్చించింది. చివరకు విజయారెడ్డి వైపే మొగ్గు చూపించింది.కాంగ్రెస్ ఢిల్లీ నేతలను ఒప్పించి టికెట్‌ దక్కించుకున్నఅజార్.. గెలుపు మాత్రం అంత ఈజీగా లేదు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరు పరిశీలంచింది. మొదట విష్ణుకే టికెట్‌ దక్కుతుందని అంతా అనుకున్నా.. చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్ఠానం అజారుద్దీన్‌వైపు మొగ్గు చూపింది. దీంతో విష్ణును పక్కన పెడుతూ అజారుద్దీన్‌ పేరును ఖరారు చేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ముందు నుంచి ఈ నియోజకవర్గంలో పట్టున్న పీజేఆర్ వర్గం ఇప్పుడు కాంగ్రెెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై అగ్గిమీద గుగ్గం అవుతున్నారు.నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం అజారుద్దీన్‌ పేరు ప్రకటించింది. దీంతో, ఇప్పుడు విష్ణు కాంగ్రెస్ గుడ్‌ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అసంతృప్తిని అనుకూలంగా మల్చుకోడానికి బీజేపీ ప్రయత్నించినా చివరకు ఆయన బీఆర్ఎస్ గూటికి చేరడానికే సిద్ధమయ్యారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఒక రోజులోనే ఆయన బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లుగా సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత ప్రకటించారు.ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్దిగా మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు పీజేఆర్ వర్గం తోడుకావడంతో విజయ అవకాశాలు మరింత మెరుగు పడ్డాయి. ఈ అనుహ్య రాజకీయ పరిణామం అజార్‌కు గట్టి ఎదురు దెబ్బగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. క్రికెట్ జీవితంలో వివాదాలు ఎదుర్కొన్న అజారుద్దీన్ తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో ఏ రకంగా సక్సెస్ అవుతారనేది చూడాల్సిందే..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్