కాంగ్రెస్ అంటే స్కామ్ అని, బి.ఆర్.ఎస్. అంటే స్కీమ్ అని, అన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చెల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ 15వ డివిజన్ లో బి.ఆర్.ఎస్. నూతన కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రేణుక రవికుమార్ దంపతులను బి.ఆర్.ఎస్. కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, బి.ఆర్.ఎస్. బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఢిల్లీ నాయకులు మొత్తం మన గల్లీల్లో తిరుగుతారని వారి మాటలు నమ్మవద్దన్నారు మంత్రి. బోడుప్పల్ ను ఎంతో అభివృద్ధి చేశామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. అనంతరం ముస్లిమ్ మైనార్టీ లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.




