Tuesday, March 10, 2026

లోక్ అదాలత్ ను సందర్శించిన న్యాయ సేవా అధికార సంస్థ  సభ్య కార్యదర్శి బబిత

- Advertisement -

కర్నూలు: ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబిత శనివారం సందర్శించారు. తనిఖీలో భాగంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ విఎన్ శ్రీనివాసరావు లను

కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్యానల్ న్యాయవాదులతో మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి సహకరిస్తున్న  కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ను అభినందించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి  సిహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు

సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎన్ శ్రీనివాసరావును పరిపాలన విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు తో కలిసి సభ్య కార్యదర్శి భబిత కోర్టు ఆవరణంలో మొక్కలను నాటారు. అనంతరం జిల్లా సబ్ జైల్లో ఉన్న  ఖైదీలకు అత్యవసర పరిస్థితులలో ఉపయోగించుకోవడానికి వీల్ చైర్స్ ను సభ్య కార్యదర్శి భబిత చేతుల మీదుగా  జిల్లా జైల్ పర్యవేక్షణ అధికారికి అందజేశారు. తనిఖీ నేపథ్యంలో న్యాయ సేవ అధికార సంస్థ ఉమ్మడి జిల్లాల సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు భూపాల్ రెడ్డి మల్లేశ్వరి దివాకర్ జోష్ణ దేవి కళ్యాణి వందన , బాల నేరస్తుల వసతి గృహ పర్యవేక్షణ అధికారి హుస్సేన్ భాష   ఆయా శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్