Wednesday, April 23, 2025

ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు, పవన్

- Advertisement -

ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు, పవన్

Babu and Pawan in Delhi election too

న్యూఢిల్లీ, నవంబర్ 25, (వాయిస్ టుడే)
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సాధించిన సంచలన విజయానికి కారణాలేమిటన్నదానిపై అందరూ రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.అందరూ ఓ కారణం చెబుతున్నారు. అదేమిటంటే ఎన్డీఏ నేతల ప్రచారం. మహారాష్ట్రతో సంంబధం లేకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ లాంటి ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు.చంద్రబాబు రెండు రోజుల ప్రచారం ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. కానీ ప్రచారానికి మాత్రం సిద్దమయ్యారు. ఇలా కలసికట్టుగా ప్రచారం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇక ముందు ఇదే ట్రెండ్ కొనసాగించాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పటికప్పుడు స్వీప్ చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల  దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా వెనుకబడిపోతోంది. గత మూడు సార్లు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీనే విజయం సాధించింది.ఈ క్రమంలో ఈ సారి అయినా ఆ పార్టీని ఓడించాలని లకష్యంగా పెట్టుకున్నారు. ఈ సారి బిన్నమైన పోల్ స్ట్రాటజీని అనుసరించాలని ఎన్డీఏ కూటమి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ తనను అరెస్టు చేశారని సానుభూతి కోసం రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో ఉండేవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే.  ఉపాధి కోసం వచ్చి స్థిరపడిన వారు ఉంటారు. ఉత్తరాదిలో ఉంటుంది కాబట్టి ఉత్తరాది ప్రజలు ఎక్కువగా వస్తారు. దక్షిణాది వారు కాస్త తక్కువగా ఉంటారు. అయితే వారు గెలుపోటముల్ని ప్రభావితం చేసేంత స్థాయిలోనే ఉంటారని అంచనా వేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో  తెలుగు ప్రజలు ఉంటారు.వీరందర్నీ ఈ సారి ఆమ్  ఆద్మీ పార్టీ నుంచి బీజేపీ వైపు మళ్లించేలా పవన్ తో పాటు చంద్రబాబుతోనూ ప్రచారం చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ఎప్పుడూ లేనంత బలంగా కనిపిస్తోంది. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పుడు మిత్ర పక్షాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ మిత్రపక్షాలపై ఆదారపడింది. అలాగని మిత్రపక్షాలు బెట్టు చేయడం లేదు. కలసిపోయి పని చేస్తున్నాయి.  ప్రచారం కూడా ఒకరికొకరు చేసుకుంటున్నారు. అందుకే రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగించి చంద్రబాబు, పవన్ లతో ప్రచారం చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్