Sunday, September 8, 2024

ఈసీని  కలిసిన బాబు, పవన్

- Advertisement -
Babu and Pawan met EC

విజయవాడ, జనవరి 9

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్‌ లిస్టులో తప్పులు ఉన్నాయని వాటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదని ఎన్నిక సంఘానికి టీడీపీ, జనసేన అధినేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఈసీతో సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని లిస్ట్ సరిచేయాలని సూచించారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… రాష్ట్రంలోని ఓటర్ల లిస్టులో జరుగుతున్న అక్రమాలు, ఎన్నికల సిబ్బంది నియామకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా వివరించామని… తమ వాదనను సుదీర్ఘంగా వివరించామన్నారు. అన్నింటికి రుజువులు ఇచ్చామని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఇక్కడ వైసీపీ నేతలు, ప్రభుత్వం చేస్తోందని ఫిర్యాదు చేశామన్నారు చంద్రబాబు. తమపై, తమ కార్యకర్తలపై అనవసరమైన కేసులు పెట్టి వేధిస్తున్న విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో పని చేయకుండా ముందస్తుగా ఇలాంటి కుట్ర చేస్తున్న విషయాన్న వివరించామన్నారు. పార్టీలతో సంప్రదాయబద్ధంగా ఎన్నికల్లో పని చేస్తున్న వ్యవస్థలను కూడా నాశనం చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు చంద్రబాబు. ఇన్నాళ్లూ ప్రజలకు అన్యాయం చేస్తూ వచ్చన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత చూసి ఓట్లు తొలగించే కుయుక్తులకు సిద్ధమైందన్నారు. ఉన్న ఓట్లు తీసేసి దొంగ ఓట్లు చేసేందుకు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తోంది వివరించినట్టు తెలిపారు. వీటికి ఉదాహరణగా చంద్రగిరిలో ఫామ్‌ 6 కింద లక్షా 15 వేలు ఓట్లు చేర్చే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇందులో 33 వేల ఓట్లు చేర్చేందుకు కిందిస్థాయి సిబ్బంది ఓకే చెప్పేశారని తెలిపారు. వీటిని రుజువులతో ఈసీకి ఇచ్చినట్టు పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ అరాచకాలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పని చేయలేక కేంద్ర భద్రత అడిగిన విషాయన్ని ఎన్నికల సంఘం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు.  పోలింగ్ విధుల కోసం దేశవ్యాప్తంగా టీచర్స్‌ను, ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తుంటారని ఇక్కడ మాత్రం సొంత మనుషులను నియమిస్తున్నారని తెలిపారు. తను ఎంపిక చేసుకున్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఎన్నికల తంతు నిర్వహించాలనే పన్నాగానికి సిద్ధమైనట్టు వివరించారు. బీఎల్‌వోలుగా ఉపాధ్యాయులు, ప్రభుత్వాధికారులు నియమించేవాళ్లని గుర్తు చేశారు చంద్రబాబు. అలాంటి అప్పుడు తప్పులు చాలా తక్కువ జరిగేవని… తప్పులు జరిగే చర్యలు తీసుకుంటారనే భయంతో వాళ్లంతా పర్ఫెక్ట్‌గా పని చేసే వాళ్లను తెలిపారు. ఇప్పుడు మాత్రం బీఎల్‌వోలుగా మహిళా పోలీసులను నియమించారని పేర్కొన్నారు. 83 నియోజకవర్గాల్లో మహిళా పోలీసులే బీఎల్‌వోలుగా ఉన్నారని తెలిపారు. వై ఎపీ నీడ్స్‌ జగన్ అనే కార్యక్రమంలో కలెక్టర్లతోపాటు ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటున్నారని అందరూ క్యాంపెయిన్ చేస్తున్నారని వివరించారు. టీడీపీ, జనసేన నేతలపై ఆరేడు వేల కేసులు పెట్టారని తెలిపారు చంద్రబాబు. ఒక్క పుంగనూరులోనే 250 మందిపై కేసులు ఉన్నాయి వీరిలో 200 మంది జైలుకు వెళ్లి వచ్చారన్నారు. ఇప్పుడ బైండ్‌ ఓవర్‌ కేసులు పెడుతున్నారు.
ఎలక్షన్‌లో ఎవరూ పని చేయకుండా చేస్తున్నారన్నారు. ఇది జరిగితే ప్రజాస్వామ్య ఖూనీ అయిపోయినట్టేనన్నారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినట్టు కూడా తెలియకుండా పర్ఫెక్ట్‌గా జరిగాయి.  ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలని సూచించారు. అన్నింటినీ విన్న ఈసీ సభ్యులు… ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా పని చేస్తామన్నారు. అవసరమైతే సెంట్రల్‌ పోలీసు అబ్జర్వర్‌లను పంపించారని చంద్రబాబు రిక్వస్ట్ పెట్టారు. ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉందని ఒక్క దొంగ ఓటు ఉన్న ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోర్టుకైనా వెళ్లి తప్పు చేస్తే వారికి శిక్ష పడే వరకు నిద్రపోమన్నారు. ఈసీ సభ్యులు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారని అన్నారు. కచ్చితంగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపినట్టు వివరించారు. హైదరాబాద్‌లో ఓటు వేసిన వాళ్లు ఇతర ప్రాంతాల్లో ఓటు వేసిన వాళ్లు ఏపీలో ఓటు వేస్తారన్న ఆరోపణలపై స్పందించారు చంద్రబాబు. రెండు చోట్ల ఓటు వేయడం తప్పని అలాగని అక్కడ ఓటు వేయకుండా ఉన్న వారికి అవకాశం ఇవ్వకపోవడం కూడా తప్పే అన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చని.. అయితే ఓటు వేసినప్పుడు నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కానీ నేరుగా డిలీట్ చేయడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘ చేయాల్సిన పనిని వైసీపీ ఎలా చేస్తుందని విమర్శించారు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు ఇక్కడకు వచ్చి ఓటు వేయకూడదా… అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే తప్పేంటీ? అని నిలదీశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్