Wednesday, March 11, 2026

బిడ్డ నీకు…కచ్చితంగా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా?

- Advertisement -

బిడ్డ నీకు…కచ్చితంగా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా?: సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్:ఏప్రిల్ 07
తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివా రం రాత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతలు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.

అడవి పందిలా పదేళ్ల పాటు తెలంగాణను సర్వనాశనం చేశారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు. మీ కాలు విరిగిందని, మీ కూతురు జైలుకి పోయిందని కొంతకా లం మేము సంయమనం పాటించా. అలా అని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకో వడానికి నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని గుర్తు పెట్టుకో బిడ్డా. మా కార్యకర్తలతో జాగ్రత్త” అంటూ చెలరేగి పోయారు సీఎం రేవంత్ రెడ్డి.

నీ లత్కోర్ మాటలకు చర్ల పల్లి జైల్లో చిప్పకూడు తిని పిస్తా. నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ డెబ్ రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డా.. నీ కొడుకు, కూతురు, అల్లుడు, నువ్వు.. అందరూ కలిసి ఉండేలా జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా” అని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

నాడు.. బీఆర్ఎస్ ను తొక్కి నట్లే.. బీజేపీని కూడా తుక్కు తుక్కుగా తొక్కు దాం. కార్యకర్తల రక్త త్యాగంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. గుజరాత్ మోడల్ కాదు.. ఇక వైబ్రెంట్ తెలంగాణ. 700 మంది రైతులను చంపినందుకు మోడీకి ఓటేయాలా..?

దేశాన్ని విభజన చేసే కుట్ర చేస్తున్నందుకు మోడీకి ఓటేయాలా..? నమో అంటే.. నమ్మితే మోసం. పదేళ్లైనా విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీకి ఓటేయాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..

మా 100 రోజుల పాలన చూసి 14 సీట్లలో గెలిపిం చండి. రాహుల్ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలి.

దేశం మొత్తం పాదయాత్ర చేసి.. ప్రజల బాధలు తెలి సిన రాహుల్.. విమానాల్లో తిరుగుతూ.. పూటకో డ్రస్ మార్చే మోడీ కాదు. నరేంద్ర మోడీ పరివార్.. ఈడీ, సీబీఐ. మాది దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పరివార్.

ఈ ఎన్నికలు మోడీ పరి వార్, గాంధీ పరివార్ మధ్య. తెలంగాణ సమాజానికి గాంధీ కుటుం బం అండగా ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్