హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ
హైదరాబాద్ జూలై 1
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ చేశారు. నేడు కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది.హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు రోజుల ముందే వాదనలు ముగిశాయి. అయితే ఆ రోజున హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ సంఘాన్ని నియమించింది. కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఇవాళ హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ
- Advertisement -
- Advertisement -