కొడాలి నానికి బ్యాడ్ డేస్
విజయవాడ, జూలై 8,
మాజీ మంత్రి కొడాలి నానికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి.ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి వద్ద ఉండిపోతానని.. బూట్లు తుడుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని కూడా కామెంట్స్ చేశారు. అయితే కూటమి అంతులేని మెజారిటీతో గెలవడంతో నాని టార్గెట్ అయ్యారు. తెలుగు యువత నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరి సవాల్ చేశారు. కోడిగుడ్లతో సైతం దాడి చేశారు. రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావ్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నాని పై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.వైసిపి అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు కొడాలి నాని. చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పై సైతం విరుచుకుపడేవారు. నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. చివరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను వదల్లేదు. మెగాస్టార్ చిరంజీవి పై సైతం హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఇదంతా విజయ గర్వంతోనే చేయగలిగారు నాని. కానీ ఈసారి గుడివాడ ప్రజలు తిరస్కరించారు. దారుణంగా ఓడించారు. అయితే తన అనుచిత ప్రవర్తనతో అందరికీ టార్గెట్ అయ్యారు కొడాలి నాని. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నానిపై ఫోకస్ పెట్టుకుంది. కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66 ఎకరాల స్థలాన్ని తిరిగి యజమానులకు అప్పగించారు. నాని మాటలను నమ్మి వాలంటీర్ పోస్టులకు రాజీనామా చేస్తామని కొందరు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదయింది.వైసిపి అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో టిట్కో ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో నిర్వహించారు. దానికి గాను ప్రజలను సమీకరించారు. ప్రజలకు నిమ్మరసం ఇచ్చేందుకు 28 లక్షల రూపాయల ఖర్చుగా చూపారు. అదే విషయాన్ని బయటపెట్టారు మంత్రి లోకేష్. గుడివాడలో గడ్డం గ్యాంగ్ దారుణాలు ఇవి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే తాజాగా కొడాలి నాని పై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయింది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేశారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరు పై తాము ఏపీ బేవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, జిల్లా కలెక్టర్ మాధవి లత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో ప్రయత్నించిన విషయాన్ని ప్రభాకర్ గుర్తు చేశారు. కొడాలి నాని అనుచరులు తమ గొడవల్లో ఉన్న లిక్కర్ కేసులను పగులు కొట్టి తగలబెట్టారని ప్రభాకర్ చెబుతున్నారు. అప్పుడు తన తల్లి మనస్తాపంతో మంచం పట్టి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకుకొడాలి నానితో పాటు వాసుదేవరెడ్డి, కలెక్టర్ మాధవి లత రెడ్డి పై కేసులు నమోదు కావడం విశేషం.
కొడాలి నానికి బ్యాడ్ డేస్
- Advertisement -
- Advertisement -