దుర్మార్గమైన పాలన మంచిది కాదు
Bad governance is not good
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
షాద్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ
లగచర్ల రైతాంగాన్ని వెంటనే జైలు నుండి విడుదల చేయాలి
భేషరతుగా ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకోవాలి
భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు
షాద్ నగర్
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల చేతులకు బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలు మంచివి కావని
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు మంగళవారం గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున వినతిపత్రం సమర్పించారు.
మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, చౌదరిగుడా, ఫరూక్ నగర్, కొందుర్గు, షాద్ నగర్ టౌన్ ప్రాంతాల నుండి విఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు లకచర్ల ఘటనలో రైతులకు బీడీలు వేసిన ఘటనతో పాటు అక్రమంగా కేసులు బనాయించి ప్రభుత్వం వారిని జైల్లో మగ్గేలా చేస్తుందని దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే యాదవ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ పేరిట భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని రైతులు తిరగబడే సరికి అక్రమంగా వాళ్లపై కేసులు బనాయించి రైతుల చేతులకు బేడీలు వేసి మానసికంగా చిత్రహింసల గురిచేస్తుందని ఆరోపించారు. రైతు హిర్యా నాయక్ కు గుండెపోటు వచ్చిన బేడులు వేసి తీసుకెళ్లడం ఎంతో దారుణమని విమర్శించారు. ఇది దుర్మార్గమైన పాలనకు సంకేతాలని అన్నారు. భూముల విషయంలో రైతులను కావాలనే రెచ్చగొట్టి తద్వారా తమ పని సులువు చేసుకున్నందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఫార్మాసిటీ అని భూముల పేరిట ముందుగా అల్లకల్లోలం చేసి ఆ తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మరో వ్యక్తి చేస్తుందని అన్నారు. అక్రమ కేసులు బనాయించిన గిరిజన అన్నదాతలపై వెంటనే కేసులు ఎత్తివేసి వేషరుదుగా వారిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అనవసరంగా హైడ్రా, మూసి అభివృద్ధి కార్యక్రమాల పేరిట కొత్త రాజకీయాలకు తెరలేపిందని అన్నారు. లకచర్ల రైతంగంపై కేసులు ఎత్తివేసి భేషరతుగా వారిని జైలు నుండి విడుదల చేయాలని అంజయ్య యాదవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రైవేట్ రాజ్యాంగం – కాంగ్రెస్ పాలసీ
తెలంగాణలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో రేవంత్ రెడ్డి సొంత రాజ్యాంగం నడుస్తుందని కాంగ్రెస్ దుర్మార్గమైన పాలసీని అమలు చేస్తోందని టిఆర్ఎస్ గిరిజన నాయకులు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్ విమర్శించారు. గిరిజన తండాల్లో నేటికీ మగదిక్కు లేకుండా పోయిందని ప్రభుత్వం గిరిజన రైతులను బెదిరిస్తుండడంతో వారు తమ ఇల్లు వదిలి పారిపోయారని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం లో ఒక ప్రైవేటు సైన్యాన్ని నడుపుతూ సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు. ముందుగా ఫార్మాసిటీ పేరుట భూములు లాక్కునేందుకు ప్రయత్నించారని రైతాంగం ఎదురుతిరిగితే వారిని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టి జైలుకు తరలించారని ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మరో కొత్త ఎత్తు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు రైతులు ఆయన మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని హెచ్చరించారు. నేటికీ 37 రోజులు జైల్లో మగ్గుతున్న గిరిజన రైతుబిడ్డలను బేషరతుగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకువస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో అన్నగారిన వర్గాల భూములను వీళ్లను లాక్కుంటుందని అన్నారు. లకచర్ల హైడ్రా మూసిల పేరుతో
రేవంత్ రెడ్డి సొంత రాజ్యాంగం అమలవుతుందని ఆక్షేపించారు.