- Advertisement -
ప్రజాసమస్యలను వదిలేపి లడ్డూపై దుష్ప్రచారం
Bad publicity on Laddu leaving public issues
కాకినాడ
వైసిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మీడియా తో మాట్లాడారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ని రాజకీయాల్లోకి టిడిపి లాగింది. టిడిపి దేవుడిని కూడా వదలడంలేదు. జరిగిన సంఘటన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగితే అది గత ప్రభుత్వానికి అంటకడుతున్నారని అన్నారు. తాము ఇచ్చిన నివేదికను పూర్తిగా నమ్మవద్దని ఎన్డీడీబీ చెప్పింది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని ఈవో చెబుతున్నా టిడిపి ఇంకా దుష్ప్రచారం చేస్తుంది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిని పట్టించుకోలేదు. ఇసుక తీవ్ర కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది. విశాఖ ఉక్కు ను ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. మహిళలు స్వేచ్చగా రోడ్ పై తిరిగే పరిస్థితి లేదు. ఏడు సంవత్సరాల ముస్లిం బాలిక శవమై తేలితే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. మెడికల్ సీట్లు తగ్గిపోయాయి. ఆర్బీకే లను మూతపడే స్ధితికి తీసుకువచ్చారని అన్నారు.
ఇది మంచి ప్రభుత్వం అని మీరు బాజా కొట్టుకోవడం కాదు ప్రజలు చెప్పాలి.ఉల్లిపాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయింది. బియ్యం,వంట నూనెలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజాసమస్యలను పక్కదారి పట్టించడానికి లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాకినాడ లో గతంలో ట్రక్కు ఇసుక 16 వేలు ఉంటే ఇప్పుడు 30 వేలు తీసుకుంటున్నారు.
ఎంతో పవిత్రమైన తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరేమీ జరగ కూడదు కాని టిడిపి చంద్రబాబు నామస్మరణ చేయిస్తుంది. చంద్రబాబుది భక్తి కాదు ప్రచారంతో లబ్ధి పొందాలనే తాపత్రయం. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసినా ప్రదాన ప్రతిపక్షం గా వైసిపి విస్మరించదు. మద్యం పాలసీ మార్చేసి 15లక్షల ఉద్యోగాలు తీసేసారు. నిత్యావసరాల ధరలు పెంచేసి మధ్యం ధరలు తగ్గిస్తారంట ఇదేమి పాలనని నిలదీసారు.
- Advertisement -


