Sunday, September 8, 2024

వైసీపీ లీడర్స్ సజ్జల,కారుమూరి పై..సి ఐ డి కి ఫిర్యాదు చేసిన..బద్రినాధ్

- Advertisement -

వైసీపీ లీడర్స్ సజ్జల,కారుమూరి పై..సి ఐ డి కి ఫిర్యాదు చేసిన..బద్రినాధ్

 

 

అధికారాన్ని అడ్డంపెట్టుకుని నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు మైనింగ్‌లో ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారని ఓ మైనింగ్‌ యజమాని ఆరోపించారు.

 

అన్ని అనుమతులు ఉన్న తన భూముల్ని లాగేసుకుని మైనింగ్‌ చేసి వేలకోట్ల క్వార్జ్‌ను విదేశాలకు తరలించారని నెల్లూరు సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

 

సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దోపిడీ వెనక ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.

 

లక్ష 50వేల టన్నుల క్వార్జ్ రాయిని తవ్వేసి దాదాపు 500 నుంచి 800కోట్ల రూపాయలు దోపిడి చేశారని ఆరోపించారు.

 

ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేసి రెండేళ్లుగా కోట్ల రుపాయల మేర క్వార్జ్‌ని తవ్వేశారని ఆరోపించారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై హైకోర్టులో కేసు వేసినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు. ఇప్పటికైన వారిపై చర్యలు తీసుకోవాలని క్వార్జ్‌ గనుల యజమాని డిమాండ్ చేశారు.

 

నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జోగుపల్లిలో 240ఎకరాల్లో మైన్స్‌ ఉన్నాయి. దానికి చట్ట బద్దంగా అన్ని అనుమతులు ఉన్నాయి. కానీ స్థానిక వైసీపీ నాయకులతో పాటు రాష్ట్రస్థాయిలో పెద్ద నేతలు బెదిరించి మైనింగ్‌ని చేజిక్కించుకుని రెండేళ్లుగా వేలకోట్ల మేర క్వార్జ్‌ని తవ్వేశారు. వందల కోట్ల విలువైన క్వార్జ్‌ని తవ్వేసి అమ్ముకున్నారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినందున అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదు చేశాను.” –

 

బద్రీనాథ్, సైదాపురం మైనింగ్‌ భూముల యజమాని

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్