కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్
కమాన్ పూర్: బహుజన ద్రోహి కెసిఆర్ కి ప్రజాక్షేత్రంలో ఓటు తో బుద్ది చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పిలుపునిచ్చారు.
కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓబిసి సెల్ పక్షాన ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన బారాస అధినేత కేసిఆర్ మాట్లాడుతూ ఇక్కడ బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చారని బీసీలందరు ఓటేయాలని చెప్పడం నిజంగా సిగ్గుచేటు అని దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బీసీలను అణగదొక్కి బహుజనులకు అన్యాయం చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి ఎన్నికల సమయంలోనే సంక్షేమ పథకాల పేరుతో మాయమాటలతో కల్లబొల్లి మాటలతో పిట్టలదొర మాటలతో ప్రజలను పక్కదోవ పట్టించే కేసీఆర్కు ప్రజాక్షేత్రంలో ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు..
ప్పి ఈ ప్రాంతంలో అజాతశత్రువుగా మచ్చలేని నాయకుడిగా చదువుకున్న వ్యక్తిగా మంథని ప్రాంతాన్ని చదువుల తల్లికి నిలయంగా మార్చిన ఏఐసీసీ కార్యదర్శి మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతి గుర్తు మీద ఓటు వేసి కేసిఆర్ కు బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి గిఫ్ట్ గా ఇవ్వాలని శ్రీధర్ బాబు అనేకమంది బహుజన నాయకులను తయారు చేయడమే కాకుండా చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వైద్యం విషయంలో ప్రతి అంశంలో కూడా బహుజన పక్షాన నిలబడ్డ బహుజన నాయకుడు శ్రీధర్ బాబు ని అవడానికి అగ్రవర్ణం అయినా కూడా ఆయన ఆలోచన విధానం ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుందని అన్నారు కాబట్టి మంథని నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈనెల 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీ శ్రీధర్ బాబు ని గెలిపించి అరాచక పాలనకు దొర గడీల పాలనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసిఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు ,కాంగ్రెస్ పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షులు వైనాల రాజు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జి ,మంతని డివిజన్ అధ్యక్షులు రవితేజ గౌడ్ కమాన్ పూర్ బీసీ సెల్ మండల అధ్యక్షులు రవి రామగిరి మండల అధ్యక్షులు బండారి సదానందం జిల్లా కార్యదర్శి జంగాపల్లి రవి,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భూoపెల్లి రాజయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ గుండా రాజు, బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు